`అఖండ‌` ఫ‌స్ట్ వీకెండ్ క‌లెక్ష‌న్స్‌..ఇంకా ఎంత రాబ‌ట్టాలంటే?

నంద‌మూరి బాలకృష్ణ, ప్రగ్యా జైశ్వాల్ జంట‌గా మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా న‌టించ‌గా.. జగపతిబాబు, పూర్ణ‌, సుబ్బరాజు కీల‌క పాత్ర‌లను పోషించారు.

భారీ అంచ‌నాల న‌డుమ డిసెంబ‌ర్ 2న విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది. తొలి రోజు ఏపీ, తెలంగాణలో రూ. 15.39 కోట్ల షేర్, రెండో రోజు రూ.6.83 కోట్ల షేర్, మూడో రోజూ రూ.7.03 కోట్ల షేర్ ను క‌లెక్ట్ చేసిన అఖండ‌.. నాలుగో రోజూ రూ.8.31 కోట్ల‌ను సాధించి ఔరా అనిపించింది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా అఖండ ఫ‌స్ట్ వీకెండ్ క‌లెక్ష‌న్లు ఇలా ఉన్నాయి..

  • నైజాం- 12.11 కోట్లు
  • సీడెడ్- 9.81 కోట్లు
  • ఉత్తరాంధ్ర- 3.74 కోట్లు
  • ఈస్ట్- 2.61 కోట్లు
  • వెస్ట్- 2.04 కోట్లు
  • గుంటూరు- 3.26 కోట్లు
  • కృష్ణా- 2.28 కోట్లు
  • నెల్లూరు- 1.71 కోట్లు
  1. ఏపీ+తెలంగాణ టోటల్: 37.56 కోట్లు (59.10 కోట్లు గ్రాస్)
  2. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా- 3.25 కోట్లు
  3. ఓవర్సీస్- 4.05 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ 4 డేస్ కలెక్షన్స్: 44.86 కోట్లు (74 కోట్లు గ్రాస్)

కాగా, అఖండ ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.53 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దీంతో ఈ చిత్రం రూ. 54 కోట్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్‌లోకి వెళ్తుంది. అయితే ఇప్ప‌టికే అఖండ చిత్రం రూ. 44.86 కోట్లకు పైగా షేర్ వసూలు చేయ‌గా.. ఇంకా రూ. 9 కోట్ల‌ను రాబ‌డితే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది.