అజిత్ స్టార్ హీరోగా ఎద‌గ‌డానికి ఆ స్టార్‌ హీరోయిన్‌తో ప్రేమే కార‌ణ‌మా?

అజిత్ కుమార్‌.. ఈయ‌న‌కు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సికింద్రాబాద్‌లో జ‌న్మించిన అజిత్ త‌మిళ స్టార్ హీరోగా ఎదిగి.. ఆపై తెలుగులోనూ అదిరిపోయే మార్కెట్‌తో పాటుగా అభిమానులెంద‌రినో సంపాదించుకున్నాడీయ‌న‌. అలాగే కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలనే చేస్తూ వ‌రుస హిట్స్ తో ఫుల్ ఫాంలో దూసుకుపోతున్న అజిల్‌.. పాన్ ఇండియా సినిమాల‌నూ చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం అజిత్ ఇంత స్టార్ స్టేట‌స్ ను అనుభవించడానికి కారణం.. ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ హీరానే కార‌ణ‌మ‌ని ఎంతో మంది అంటుంటారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. అజిత్ తెలుగులో న‌టించిన తొలి చిత్రం `ప్రేమ పుస్త‌కం`. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో అజిత్‌కి.. అప్పట్లోనే స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న హీరాతో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. హీరా అందానికి ఫిదా అయిన అజిత్‌.. సెట్స్‌లో ఉన్నప్పుడే ఆమెకు ప్రేమ లేఖ‌లు రాసేవాడు.

క్ర‌మ‌క్ర‌మంగా వీరిద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం బ‌ల‌ప‌డి ప్రేమ‌గా మారింది. హీరా తనకు ఉన్న క్రేజ్ ను మొత్తం ఉపయోగించి, పెద్ద పెద్ద డైరెక్టర్ల సినిమాలలో నటించే అవకాశాన్ని ఇప్పించింది. అంతే కాదు ఒక పక్క ఇతర స్టార్ హీరోలతో నటిస్తూ, మరో పక్క అజిత్ కోసం తన డేట్స్ ను కూడా సర్దుబాటు చేసుకుని మ‌రీ ఆయ‌న‌తో న‌టించేది.

అంతలా వీరి ప్రేమ అప్పట్లో కొనసాగింది. అలాగే అజిత్ స్వ‌యంగా హీరోను త్వ‌ర‌లోనే పెళ్లి కూడా చేసుకుంటాన‌ని చెప్పేశారు. కానీ, ఏమైందో ఏమో వీరిద్ద‌రూ విడిపోయాడు. హీరో సాయంతో స్టార్ హీరోగా ఎదిగిన అజిల్‌.. ఒకప్పటి టాప్ హీరోయిన్ షాలినిని 2000 సంవత్సరంలో పెళ్ళి చేసుకున్నాడు. ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు సంతానం క‌లిగారు.

 

Share post:

Popular