సమంత లవ్ స్టోరీకి విలన్ ఆ స్టార్ హీరోయినే.. ఇంతకు ఆమె ఎవరంటే..!

నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సమంత వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ దూసుకెళ్తోంది. ప్రస్తుతం సమంత తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలో కూడా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం సమంత తమిళ్ లో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న కాతువాకుల రెండు కాదల్ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది.ఇందులో మరో హీరోయిన్ గా నయనతార నటిస్తోంది.

ఈ సినిమాకు నయనతార లవర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెలలో వెండితెరపై విడుదలకానుంది. కాగా ఈ సినిమాలో నయనతార నెగటివ్ రోల్ పోషిస్తున్న ట్లు సమాచారం. ఈ మూవీలో విజయ్ సేతుపతి సమంత లవర్స్ అయితే.. వారి ప్రేమకు నయనతార విలన్ గా మారుతుందని తెలుస్తోంది. ఈ మూవీ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది.

నయనతార నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం ఇదే మొదటి సారి. అలాగే సమంత నయనతార కూడా కలిసి నటిస్తున్న తొలి మూవీ ఇదే. తనకు కాబోయే మొగుడు విగ్నేష్ శివన్ తో కలిసి నయనతార రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తోంది. సమంత ప్రస్తుతం తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమాలో నటిస్తోంది. అలాగే అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేస్తోంది. ఇక హిందీలో హీరోయిన్ తాప్సీ నిర్మాణ సంస్థలో సమంత ఓ సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Share post:

Latest