హాట్ టాపిక్‌గా త‌మ‌న్ రెమ్యూన‌రేష‌న్‌..ఒక్కో సినిమాకు ఎంతంటే?

ఎస్.ఎస్. తమన్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో వంద చిత్రాల‌కు పైగా సంగీతం అందించిన త‌మ‌న్‌.. సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ పాతికేళ్ల‌కు పైగానే అయింది. 6వ తరగతిలోనే చదువుకు స్వ‌స్థి ప‌లికి తనకు ఇష్టమైన మ్యూజిక్ పైనే ఫోకస్ పెట్టిన త‌మ‌న్‌.. మొదట మాధవపెద్ది సురేష్ వద్ద జాయిన్ అయ్యడు.

ఆయన సంగీతం అందించిన `భైరవ ద్వీపం` సినిమాకు డ్రమ్స్ వాయించి.. రూ. 30 మొదటి పారితోషకంగా అందుకున్నాడు. ఆ త‌ర్వాత ప్ర‌ముఖుల‌ స‌పోర్ట్‌తో ప‌లు అవ‌కాశాలు అందుకున్న ఈయ‌న ఒక్కో మెట్టు ఎక్కుతూ.. టాలీవుడ్‌, కోలీవుడ్ స్టార్ హీరోల‌కు మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా మారిపోయాడు.

అయితే త‌న‌దైన సంగీతంతో సినిమాల‌పై భారీ హైప్ క్రియేట్ చేయ‌గ‌ల స‌త్తా ఉన్న త‌మ‌న్‌.. ప్ర‌స్తుతం ఒక్కో సినిమాకు కోట్ల‌లో రెమ్యూన‌రేష‌న్ పుచ్చుకుంటున్నాడ‌ట‌. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్ ప్ర‌కారం.. చిన్న సినిమా అయినా స్టార్ హీరోల సినిమా అయినా రూ.2.5 కోట్ల నుంచి రూ.3.5 కోట్ల వ‌ర‌కు త‌మ‌న్ రెమ్యూన‌రేష‌న్‌గా పుచ్చుకుంటున్నాడ‌ట‌.

కాగా, అల వైకుంఠ‌పురంలో, వ‌కీల్‌సాబ్‌, క్రాక్ సినిమాల‌తో ఈ మ‌ధ్య మ‌రింత క్రేజ్‌ను సంపాదించుకున్న త‌మ‌న్‌.. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ `అఖండ‌`, మ‌హేష్ బాబు `స‌ర్కారు వారి పాట‌`, ప‌వ‌న్ క‌ళ్యాణ్ `భీమ్లా నాయ‌క్‌`, వ‌రుణ్ తేజ్ `గ‌ని` త‌దిత‌ర చిత్రాల‌కు మ్యూజిక్ అందిస్తున్నాడు.

Share post:

Latest