బాలయ్యను పట్టించుకోని బ్యూటీ.. పాప జాగ్రత్త!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ’ చిత్రం ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఇక ఈ సినిమా తరువాత యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓ పవర్‌ఫుల్ కథను బాలయ్యకు వినిపించడంతో ఈ సినిమా చేసేందుకు బాలయ్య రెడీ అయ్యాడు. అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అనే అంశంపై తీవ్ర చర్చ సాగింది.

అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా చాలా మంది పేర్లు వినిపించినా చివరకు అందాల భామ శృతి హాసన్‌ను ఓకే చేశారు చిత్ర యూనిట్. దర్శకుడు గోపీచంద్ గత చిత్రాల్లో ఆమె హీరోయిన్‌గా నటించడంతో ఆయన ఈ సినిమాలో నటించాల్సిందిగా కోరాడట. దీంతో గోపీచంద్ కోసం వెంటనే ఓకే చెప్పిందట ఈ బ్యూటీ. అయితే బాలయ్య పక్కన చేయడానికి మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించిందనే వార్త ఇటీవల సోషల్ మీడియాలో జోరుగా వినిపించింది.

కాగా ఈ సినిమాలో శృతి ఎంట్రీని అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్‌కు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా శృతి హాసన్ థ్యాంక్స్ చెప్పింది. గోపీచంద్ లాంటి డైరెక్టర్‌తో వర్క్ చేయడం తనకు బాగా నచ్చిందని, మరోసారి అదే టీమ్‌తో పనిచేయడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొంది. అయితే ఇక్కడే అమ్మడు నిప్పుతో చెలగాటం ఆడింది. బాలయ్య లాంటి స్టార్ హీరో పేరును కూడా ప్రస్తావించకుండా పోస్ట్ పెట్టడంతో నందమూరి ఫ్యాన్స్ ఆమెను ఓ రేంజ్‌లో ట్రోలింగ్ చేస్తున్నారు. ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకుంటే మంచిదని, లేకపోతే మున్ముందు అమ్మడికి చుక్కలు చూపించడం ఖాయమని వారు హెచ్చరిస్తున్నారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

Share post:

Popular