షాకింగ్ న్యూస్: తలైవా ఇకమీదట సినిమాలకు గుడ్ బై..!

సౌత్ ఇండస్ట్రీ లో రజనీకాంత్ కి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవలే ఆయనకు దాదా ఫాల్కే అవార్డు కూడా దక్కించుకున్నాడు. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ ఇకపై సినిమాలకు దూరం కానున్నారా అనే వార్త బాగా పాపులర్ అవుతోంది. కొత్త సినిమా విడుదలైన ప్రతిసారి ఇలానే ఈ వార్త చక్కర్లు కొడుతూ ఉంటుంది. కానీ రజనీకాంత్ మాత్రం తన కొత్త సినిమాలు విడుదల చేసిన వెంటనే మరో కొత్త ప్రాజెక్టులు కూడా ప్రారంభిస్తూ ఉంటాడు.

తాజాగా రజనీకాంత్ నటించిన పెద్దన్న సినిమా విడుదలైంది. ఇక రజనీకాంత్ ఆఖరి సినిమా ఇదే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి ఎప్పటిలాగే కాకుండా ఈసారి ఈ వార్త నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకు తగిన కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అది ఏమిటంటే రజనీకాంత్ కు ఇప్పుడు 70 ఏళ్లు. దానికి తోడు ఈ మధ్య కాలంలో ఆయన ఆరోగ్యం అసలు బాగాలేదు. షూటింగ్ లో కన్నా ఎక్కువ హాస్పిటల్ లోనే ఉంటున్నారు.

తాజాగా విడుదలైన పెద్దన్న సినిమా షూటింగ్ సమయంలో కూడా ఈయన ఆరోగ్యంతో చాలా ఇబ్బంది పడ్డారు దీంతో కుటుంబం నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది అన్నట్లుగా వినిపిస్తోంది. అందుచేత ఈయన సినిమాలకు గుడ్ బై చెబుతున్నారు అని వార్త వినిపిస్తోంది. ఇక తాజాగా ఏదో ఒక సినిమా కూడా చేయాల్సి ఉండగా ఆ ప్రాజెక్టు కూడా నిలిపివేశారు అన్నట్టుగా వార్త వినిపిస్తోంది.

Share post:

Latest