బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో పదకొండో వారం కొనసాగుతోంది. 19 మందితో ప్రారంభమైన ఈ షోలో.. ఇంకా తొమ్మిది మందే మిగిలిరు. ఇక ఈ వారం కాజల్, షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, ఆనీ మాస్టర్, ప్రియాంక, మానస్ మరియు సన్నీలు నామినేట్ అవ్వగా.. ఈ ఎనిమిది మందిలో ఒకరు ఆదివారం బ్యాగ్ సద్దేయబోతున్నారు.
అయితే నామినేషన్‌లోకి వచ్చిన ప్రతి సారీ షణ్ముఖ్ జస్వంత్ టాప్ ఓటింగ్‌తో ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్‌లోనే ఉండేవాడు. కానీ, ఆ సారి మాత్రం ఓటింగ్‌లో షణ్ముఖ్ వెనకపడ్డాడట. మరోవైపు అతడి గ్రాఫ్ రోజురోజుకు చిత్తు చిత్తవుతోందని పలు సర్వేలు చెబుతున్నాయి. ఇక ఇందుకు ప్రధాన కారణం సిరినే అని జోరుగా ప్రచారం జరుగుతోంది.
గడిచిన కొన్ని ఎపిసోడ్స్‌ను గమనిస్తే సిరి, షణ్ముఖ్‌ల రిలేషన్ వేరే విధంగా పోతోంది. ప్రతీ సారి సిరి అలగడం.. లేదా షణ్ముఖ్ అలగడం.. వీరిద్దరి ఏడ్పులు, పెడబొబ్బలు ప్రేక్షకులను తీవ్ర అసహనానికి గురి చేస్తున్నాయి. అలాగే తాజా ఎపిసోడ్‌లో వీరిద్దరూ హద్దులు మీరి రొమాన్స్ పండించారు.
దీంతో షణ్ముఖ్-సిరిల వ్యవహార శైలిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెట్టారు. పైగా టాస్కుల్లో యాక్టివ్‌గా ఉండకపోవడం షణ్ముఖ్ కు మైనస్‌గా మారింది. అందు వల్లనే అతడి గ్రాఫ్ క్రమక్రమంగా పడిపోతోందని అంటున్నారు. మొత్తానికి ప్రేక్షకులెందరికో ఫేవరేట్ కంటెస్టెంట్‌గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన షుణ్మిఖ్.. ఇప్పుడు ఆ ఆడియన్స్ చేతే విమర్శల పాలవుతున్నాడు.