సంక్రాంతి కానుకగా రాధేశ్యామ్..నిజమేనా..?

ప్రముఖ దర్శకుడు కె రాధాకృష్ణ దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న సినిమా రాధే శ్యామ్.. ఇక ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ , టీ- సీరీస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది కాబట్టి ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను, పోస్టర్లను విడుదల చేశారు.తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నట్లుగా పాన్ ఇండియా మూవీ గా సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను ఫిబ్రవరి 14 వ తేదీన విడుదల చేశారు. టీజర్ మాత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే ఆ రోజు నుంచి ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి న్యూస్ రాకపోవడంతో అభిమానులలో ఆందోళనలు రేకెత్తుతున్నాయి. కానీ తాజాగా యు.వి.క్రియేషన్స్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా సంక్రాంతి కానుకగా 2022 జనవరి 14వ తేదీన విడుదల చేస్తారు అన్నట్టుగా సమాచారం.. అయితే జనవరి 14వ తేదీ ఈ సినిమాను విడుదల చేయాలి అనుకుంటే.. మరి ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనే క్వశ్చన్ ప్రస్తుతం అందరి మదిలో మొదలవుతోంది. అయితే నిజంగా ఈ సినిమా జనవరి 14వ తేదీన విడుదల అవుతుందా..? లేదా ..? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇకపోతే అభిమానులు మాత్రం విశ్రాంతి లేకుండా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అని తెలుస్తోంది.

Share post:

Latest