స‌మంత కీల‌క నిర్ణ‌యం..ఇక నిర్మాత‌ల‌కి చుక్క‌లే..?!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌లె భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టిన సామ్‌.. న‌చ్చిన సినిమాల‌కు ఓకే చెప్పుకుంటూ పోతోంది. ఇప్ప‌టికే గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `శాకుంతలం` మూవీని పూర్తి చేసిన ఈ భామ‌..డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై శంతరూబెన్ జ్ఞానశేఖరన్ ద‌ర్శక‌త్వంలో తెలుగు-తమిళ భాషల్లో ఓ సినిమా చేయబోతోంది.

Samantha hikes her Remuneration - Cine Chit Chat

శ్రీదేవి మూవీస్ నిర్మాణ సంస్థలో హరి, హరీష్ దర్శకత్వంలో మరో సినిమాని కూడా ఇటీవ‌లె ప్ర‌క‌టించింది. అలాగే మ‌రిన్ని ప్రాజెక్ట్స్ కూడా చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉండ‌గా.. స‌మంత తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే..ఆమె త‌న రెమ్యూన‌రేష‌న్‌ను భారీగా పెంచేసింది.

Samantha hikes remuneration

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్కో సినిమాకు రెండున్న‌ర కోట్ల వ‌ర‌కు పుచ్చుకుంటున్న సామ్‌.. ఇక‌పై రూ.3 కోట్ల నుంచీ రూ.4 కోట్ల వ‌ర‌కు తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంద‌ని గుస‌గ‌స‌లు వినిపిస్తున్నారు. మ‌రి ఇదే నిజ‌మైతే.. నిర్మాత‌ల‌కి చుక్క‌లే అని ప‌లువురు భావిస్తున్నారు.

Share post:

Popular