కన్ఫం: ఈరోజు బిగ్‌బాస్ నుండి బయటకు వచ్చేది వీరే!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 5 అప్పుడే సగానికిపైగా ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. రోజుకో ఆటతో ఇంటిలోని కంటెస్టెంట్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బిగ్‌బాస్, వారానికొకరు చొప్పున బయటకు పంపిస్తూనే ఉన్నాడు. అయితే 10వ వారంలో బిగ్‌బాస్ ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయంపై హౌజ్‌మేట్స్‌లోనే కాకుండా ప్రేక్షకుల్లో సైతం ఎక్కువ ఆసక్తి కలిగింది. ఇప్పుడున్న కంటెస్టెంట్స్‌లో అందరూ గట్టి పోటీనిస్తూ ఎదుటివారిని టార్గెట్ చేస్తూ దూసుకుపోతున్నారు.

కాగా ఇవాళ 10వ వారం వీకెండ్ కావడంతో ఈ వారం ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారా అని అందరిలో టెన్షన్ నెలకొంది. అయితే ఇంట్లోని హౌజ్‌మేట్స్‌లో ఎక్కువగా మానస్ ఈవారం ఎలిమినేట్ అవుతారని అనకుంటున్నారు. అటు ప్రేక్షకుల్లో కూడా మానస్ ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతాడని అంటున్నారు. అయితే ప్రేక్షకులు ఊహించనిది చేయడమే బిగ్‌బాస్ స్పెషాలిటీ. అందుకే ఈవారం ఎలిమినేట్ అయ్యేది మానస్ కాదని తెలుస్తోంది.

మానస్ కంటే కూడా ఓటింగ్‌లో వెనుకబడ్డ ఆర్జే కాజల్ ఈవారం ఇంటినుండి బయటకు వెళ్తుందని బిగ్‌బాస్ వర్గాలు చెబుతున్నాయి. ఇన్‌సైట్ టాక్ ప్రకారం కాజల్‌కు ఓటింగ్ చాలా తక్కువగా పడుతుండటంతో ఆమెను బిగ్‌బాస్ ఇంటికి పంపేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా మానస్ ఈవారం ఎలిమినేట్ అవుతాడని అందరూ మానసికంగా ఫిక్స్ అయిన వేళ ఇలా కాజల్‌ను బయటకు పంపేసి మరింత ట్విస్ట్ ఇస్తున్నాడు బిగ్ బాస్. మరి శనివారం నాడు నాగార్జున వచ్చి ఎవరిని ఇంటికి పంపిస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Share post:

Latest