ఆర్సీ 15.. సెకండ్ షెడ్యూల్.. ఎక్కడో తెలుసా?

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఆర్సి15. ఇందులో రామ్చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. షెడ్యూల్లో కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు ఒక భారీ స్థాయిలో రూపొందించిన సెట్లో ఒక పాటను చిత్రీకరించినట్లు సమాచారం. తొలి షెడ్యూల్ ను మహారాష్ట్రలోని పూణే, సతారా,పాల్టన్ లలో చిత్రీకరించారు. నవంబర్ 10 న మొదటి షెడ్యూల్ ముగియడంతో సెకండ్ షెడ్యూల్ వెళ్ళడానికి ముందు కొన్ని రోజులు విరామం తీసుకుంది.

ఇక ఈనెల 15 నుంచి హైదరాబాదులోని రామానాయుడు స్టూడియో లో సెకండ్ షెడ్యూల్ మొదలుకానుంది. షెడ్యూల్ లో ఒక సాంగ్ తో పాటు ఇతర ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఈ సినిమా పవర్ ఫుల్ సోషల్ మెసేజ్ పొలిటికల్ డ్రామా గా రూపొందుతోంది. ఈ సోషల్ డ్రామాలు రామచరణ్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి ఆఫీసర్గా కనిపించబోతున్నాడు.దర్శకుడు శంకర్ ఇంతకుముందు సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉండబోతుంది.

Share post:

Popular