శంకర్ సినిమాలో చరణ్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో మరో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రం రిలీజ్ కాకముందే, చరణ్ తన నెక్ట్స్ మూవీని ప్రారంభించాడు.

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ తన కెరీర్‌లో 15వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాను ఇప్పటికే అధికారికంగా ప్రారంభించగా, ఇటీవల రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభించారు. ఇక ఈ సినిమా తొలి షెడ్యూల్‌లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు చిత్ర యూనిట్. అయితే ఇప్పుడు ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే ఈ షెడ్యూల్‌లో ఓ అదిరిపోయే సాంగ్‌ను షూట్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

ఈ పాటను స్టార్ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ కంపోజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అదిరిపోయే స్టెప్పులతో మరోసారి చరణ్ ఈ పాటతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. సరికొత్త కాన్పెస్ట్‌తో రాబోతున్న ఈ సినిమాలో చరణ్ ఓ సరికొత్త అవతారంలో కనిపిస్తాడని తెలుస్తోంది. మరి సెకండ్ షెడ్యూల్‌లో చేయబోయే ఈ సాంగ్ ఈ సినిమాకు ఎలాంటి హైప్‌ను క్రియేట్ చేస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

Share post:

Latest