రాధేశ్యామ్ సెకండ్ లిరికల్ వీడియో వచ్చేసింది.. క్యూట్ గా ప్రభాస్, పూజా హెగ్డే జంట..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రాధేశ్యామ్. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను యు.వి.క్రియేషన్స్, టీ సీరిస్ బ్యానర్ ల పై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 1960 నాటి వింటేజ్ ప్రేమకథతో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఒక సింగిల్ సాంగ్ విడుదల కాగా.. సెకండ్ సింగిల్ సాంగ్ ప్రోమో ఇవాళ విడుదలైంది.

- Advertisement -

‘నగుమోము తారలే ‘ అని సాగే మెలోడీ ని సిద్ శ్రీరామ్ చక్కగా పాడారు. పాట వినడానికి వినసొంపుగా ఉంది. లిరికల్ వీడియోలో విజువల్స్ అదిరిపోయేలా ఉన్నాయి. సినిమాలు చాలా గ్రాండ్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.రాధే శ్యామ్ తెలుగు వర్షన్ కు జస్టిన్ ప్రభాకర్ సంగీతమందించారు. సెకండ్ సింగిల్ పూర్తి పాట డిసెంబర్ ఒకటవ తేదీన విడుదల కానుంది.

కాగా లిరికల్ వీడియోలో ప్రభాస్, పూజ హెగ్డే జంట వీనుల విందుకుగా ఉంది. తెరపై వీరిద్దరి జంట చూడముచ్చటగా ఉంది. రాధే శ్యామ్ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.ఈ సినిమా విడుదల కావడానికి ఎంతో సమయం లేకపోవడంతో ఇక వరుసగా రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి అప్డేట్ లు ఇవ్వాలని చిత్రయూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్లో టీజర్, జనవరి మొదటివారంలో ట్రైలర్ విడుదల చేసేందుకు సమాయత్తం అవుతున్నారని సమాచారం.

 

Share post:

Popular