అర‌రే..రంగ‌మ్మ‌త్త కూడా వాళ్ల‌ని కాపాడ‌లేక‌పోయిందా..?

దేశవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ అందుకున్న మాస్టర్ చెఫ్ కార్యక్రమాన్ని తెలుగులో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్ర‌ముఖ టీవీ ఛానెల్ జెమినీలో ఈ షో ప్రసారం అవుతోంది. మొద‌ట ఈ కుక్కింగ్ షోకు మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌గా.. ఆమెకున్న క్రేజ్ ఈ షో టీఆర్పీనీ ఏ మాత్రం పెంచ‌లేక‌పోయింది.

Telangana Today Food News, Page 2 of Latest Telangana Today Food Epaper | Dailyhunt

దాంతో షో నిర్వాహ‌కులు త‌మ‌న్నాను త‌ప్పించి బుల్లితెర హాట్ యాంక‌ర్ అన‌సూయ‌ను రంగంలోకి దింపారు. కానీ, వినిపిస్తున్న తాజా స‌మాచారం ప్ర‌కారం.. అన‌సూయ సైతం మాస్ట‌ర్ చెఫ్ నిర్వాహ‌కుల‌ను కాపాడ‌లేక‌పోయింద‌ట‌. అనసూయ ఎంట్రీతో టీఆర్పీ గాడిన పడుతుందని ఆశించిన నిర్వాహకులకు నిరాశే ఎదురైంద‌ట‌.

MasterChefOnGeminiTv - Twitter Search

రంగ‌మ్మ‌త్తతో టీఆర్పీ పెరగకపోగా, మరింతగా పడిపోయింద‌ట‌. దాంతో షో నిర్వాహ‌కులు ఏం చేయాలో అర్థంగాక త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే మ‌రోవైపు అన‌సూయ హోస్ట్‌గా బాధ్యతలు తీసుకుని కొద్దివారాలే అవుతుంది కాబ‌ట్టి.. మ‌రికొన్ని రోజుల్లో షో పుంజుకునే అవ‌కాశం ఉంద‌నే వాద‌న కూడా వినిపిస్తోంది.

Share post:

Latest