భ‌ర్త‌తో అడ్డంగా బుక్కైన కాజ‌ల్‌..మండిప‌డుతున్న నెటిజ‌న్లు!

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇటీవ‌లె భ‌ర్త గౌత‌మ్ కిచ్లూతో మొద‌టి వివాహ వార్షికోత్సవాన్ని ఘ‌నంగా జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట తెగ వైర‌ల్ అయ్యాయి. అయితే ఇప్పుడీ జంట నెటిజ‌న్ల చేతుల్లో అడ్డంగా బుక్కైయ్యారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

Kajal Agarwal expecting her first child with Gautam Kitchlu?

తాజాగా కాజ‌ల్ ఇన్‌స్టాగ్రామ్‌లో భ‌ర్త‌తో దిగిన ఓ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో టీచర్స్ బ్రాండ్‌కు సంబంధించిన మందు బాటిల్ బాగా ఎలివేట్ అవుతుండ‌గా.. దాన్ని సేవిస్తూ గౌత‌మ్‌-కాజ‌ల్‌లు పేకాట ఆడుతున్నారు. అంతేకాదు, త‌న పోస్ట్‌కి..`ఈ పండుగను టీచర్స్ స్మూత్ లిక్విడ్‌తో సెలెబ్రేట్ చేసుకోండి. ఇదే పర్ఫెక్ట్ కాంబినేషన్.

Kajal Aggarwal-Gautam Kitchlu love story: We dated for three years, then were friends for seven | Celebrities News – India TV

ఈ విస్కీ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా మారినందుకు నాకు కిచ్లూకు ఎంతో ఆనందంగా ఉంది. బాధ్యతగా తాగండి. ఈపోస్ట్ కేవలం పాతికేళ్లు నిండిన వారికే` అని రాసుకొచ్చింది కాజల్. ఇంకేముంది.. నెటిజ‌న్లు కాజ‌ల్‌పై మండిప‌డుతున్నారు. ప్ర‌జ‌ల‌కు హాని చేసే మద్యం బ్రాండ్ల‌ను ప్ర‌మోట్ చేయ‌డం సిగ్గ‌నిపించ‌డం లేదా..? డ‌బ్బు కోసం ఇంత దిగ‌జారాలా.. అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

https://www.instagram.com/p/CVsPa-QsThL/?utm_source=ig_web_copy_link

Share post:

Latest