మ‌ళ్లీ అత‌డితో `క‌నెక్ట్‌` అవుతున్న న‌య‌నతార‌..మ్యాట‌రేంటంటే?

సౌత్ ఇండియా లేడీ సూప‌ర్ స్టార్ నయ‌న‌తార గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అగ్ర హీరోల స‌ర‌స‌న ఆడిపాడి సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ‌.. మ‌రోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది.

- Advertisement -

Nayanthara reunites with director Ashwin Saravanan for new horror film, Connect. See poster - Movies News

ఇక తాజాగా ఈ బ్యూటీ మ‌రో లేడీ ఓరియెంటెడ్ మూవీని సెలెక్ట్ చేసుకుంది. అదే `క‌నెక్ట్‌`. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. కొంత కాలం క్రితం న‌య‌న్ `మాయా` అనే హారర్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన విష‌యం తెలిసిందే.

Maya tamil | Sun NXT

అశ్విన్ శరవణన్ అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రం అద్భుత‌మైన టాక్‌ను సొంతం చేసుకుని మంచి క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టింది. అయితే ఇప్పుడు అదే డైరెక్ట‌ర్‌తో `క‌నెక్ట్‌` అనే మ‌రో హారర్ సినిమాను న‌య‌న్‌ ప్ర‌క‌టించింది.

Image

తాజాగా మేక‌ర్స్ ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు. ఇక త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ చిత్రం నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేశ్‌ శివన్ కలిసి నిర్వహిస్తున్న రౌడీ పిక్చర్స్ బ్యానర్ పైన‌ నిర్మితం కానుంది.

Share post:

Popular