సమంత కంటే ముందే స్టార్ హీరోయిన్ ప్రేమలో చైతూ..!

నాగచైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా 2010లో ఏం మాయ చేసావే అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సమంత చైతూ బెస్ట్ ఫ్రెండ్స్ గా మారారు. ఆ తర్వాత సమంత హీరో సిద్ధార్థ్ ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. వారిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటున్నట్లు రూమర్స్ వచ్చాయి. ఆ తర్వాత ఏమైందో తెలీదుగానీ వారిద్దరూ విడిపోయారు. ఇది జరిగిన కొన్నేళ్ల తర్వాత సమంత, నాగ చైతన్య ప్రేమలో ఉన్నట్లు బయటి ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత వారిద్దరూ తమ మధ్య ఉన్న రిలేషన్ షిప్ గురించి అధికారికంగా ప్రకటించారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

మూడేళ్లపాటు సజావుగా సాగిన వీరి కాపురం ఇటీవల విడాకుల వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. మేమిద్దరం విడిపోతున్నాం..అని సమంత, నాగచైతన్య అధికారికంగా కూడా వెల్లడించారు. కాగా తాజాగా నాగచైతన్య సమంత కంటే ముందే మరో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తో ప్రేమాయణం నడిపినట్లు తెలుస్తోంది.

వీరిద్దరి రిలేషన్ షిప్ గురించి koimoi. Com వార్త ప్రచురించింది. ఇందులో ప్రకారం.. నాగచైతన్య శృతి హాసన్ కు మధ్య 2013లోనే పరిచయం ఏర్పడిందట. సమంతను పెళ్లి చేసుకోక ముందే 2017 లో చైతూ శృతి తో డేటింగ్ చేసాడంట. కొన్నాళ్లపాటు వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ సీరియస్ గానే సాగింది. ఆ తర్వాత వీరు వివాహం కూడా చేసుకోవాలని భావించారట. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ ఇద్దరు విడిపోయారని ఆ వెబ్ సైట్ తెలిపింది. కాగా 2018లో నాగచైతన్య, శృతి హాసన్ హీరో, హీరోయిన్లుగా వచ్చిన ప్రేమమ్ అనే సినిమా విజయవంతమైంది.

Share post:

Popular