ఆ నిర్మాత వాడుకుని వ‌దిలేశాడు..ముమైత్ ఖాన్ ఆవేద‌న‌?!

ముమైత్ ఖాన్‌.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. `ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే! ` అంటూ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గన్నాథ్ తెర‌కెక్కించిన‌ `పోకిరి` సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ముమైత్‌. మొద‌టి చిత్రంతోనే యూత్‌లో సూప‌ర్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న ముమైత్‌.. ఐటెం భామగా తనదైన డాన్సింగ్ మూమెంట్స్‌తో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ను దశాబ్ధ కాలం పాలు ఓ ఊపు ఊపేసింది.

ముమైత్ ఖాన్‌ క్రేజ్ చూసి ప‌లువురు నిర్మాత‌లు ఆమెను హీరోయిన్‌గా పెట్టి సినిమాలు తీసేందుకు కూడా వెంట‌ప‌డేవారు. సిల్క్ స్మిత తర్వాత ఆ రేంజ్‌లో ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ భామ‌.. ఓవైపు ఐటెం సాంగ్స్ చేస్తూనే మ‌రోవైపు ప‌లు సినిమాల్లో ప్రధాన పాత్రల్లో తన అందచందాల‌ను ఎర‌గా వేస్తూ ప్రేక్ష‌కుల‌ను అలరించింది.

అయితే ఈ క్ర‌మంలోనే ఓ నిర్మాత చేతుల్లో అడ్డంగా మోస‌పోయింది. నటీనటులు సినిమాలలో నటించిన తర్వాత పారితోషికం విషయంలో మోసపోతుంటారు. ఈ లిస్ట్‌లో ముమైత్ కూడా ఒక‌రు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. 2009లో పున్నమినాగు సినిమాలో ముమైత్ ఖాన్ న‌టించింది. కోదండరామిరెడ్డి దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని రోయల్ ఫిలిం కంపెనీ నిర్మాణ సంస్థ పై విజయ్ కుమార్ నిర్మించాడు.

అయితే ముమైత్‌ను నిర్మాత విజ‌య్ కుమార్ రెమ్యూన‌రేష‌న్ విష‌యంలో దారుణంగా మోసం చేశాడ‌ట‌. ఓవ‌ర్ ఎక్స్ పోజ్ చేస్తే ఎక్స్ట్రా డ‌బ్బు ఇస్తామ‌ని నిర్మాత‌ మాట ఇచ్చాడ‌ట. దీంతో ఈ చిత్రంలో రెండు పాత్ర‌ల‌ను పోషించిన ముమైత్‌.. విచ్చ‌ల విడిగా అందాల‌ను ఆర‌బోసింది. కానీ చివ‌ర‌కు ఒక్క పైసా కూడా ఇవ్వలేదట. దాంతో వాడుకుని వ‌దిలేశార‌ని.. తన అందచందాలు ఆరబోస్తేనే సినిమాకు ఓపెనింగ్స్ వచ్చాయని ..కానీ కృతజ్ఞత ఏ మాత్రం లేదని ముమైత్ గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో చెబుతూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

Share post:

Latest