లైగర్‌ను పొట్టుపొట్టు కొట్టేందుకు రెడీ అవుతోన్న టైగర్!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్ కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో దర్శనమిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

కాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ బాక్సర్‌గా మనకు కరనిపిస్తాడు. అయితే ఈ సినిమాలో వరల్డ్ ఫేమస్ లెజండరీ బాక్సర్ మైక్ టైసన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఆయన పాత్రకు సంబంధించి త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ క్రమంలో మైక్ టైసన్ తన పాత్రకు సంబంధించి ట్రెయినింగ్ తీసుకుంటున్న ఓ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో పోటీ పడే బాక్సర్‌గా మైక్ టైసన్ కనిపిస్తాడనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఇదే గనక నిజం అయితే లైగర్‌ను కొట్టే క్రమంలో ఈ టైగర్ ఎలాంటి టెక్నిక్స్ వాడుతాడా అనేది ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అందాల భామ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Share post:

Latest