ఆ వింత వ్యాధితో బాధ‌ప‌డుతున్న మెహ్రీన్‌..!

మెహ్రీన్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కృష్ణ గాడి వీర ప్రేమ‌ గాధ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. అన‌తి కాలంలోనే సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా ఉన్న మెహ్రీన్‌.. ఓ వింత వ్యాధితో బాధ ప‌డుతోందట‌. అవును, ఈ విష‌యం ఎవ‌రో కాదు.. ఆమెనే స్వ‌యంగా తెలిపింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

Mehreen Pirzada | You & I

`మంచి రోజులు వ‌చ్చాయి` సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న మెహ్రీన్‌..త‌న‌కు అతిశుభ్ర‌త చాలా అంటే చాలా ఎక్కువ అని చెప్పుకొచ్చింది. మహానుభావుడు సినిమాలో హీరోకు ఓసీడీ వ్యాధి ఉంటుంది. ఆ వ్యాధే నాకు రియల్ లైఫ్ లో ఉంది.

Mehreen Pirzada (aka) Mehrene Kaur Pirzada photos stills & images

కరోనా వచ్చిన తర్వాత అంద‌రూ శానిటైజర్లు వాడుతున్నారు. కానీ, నేను ఎన్నో ఏళ్ల నుంచి వాటిని వాడుతున్నా. నా స్టాఫ్ చేతులు కడుక్కోకపోయినా, శానిటైజర్ రాసుకోకపోయినా వారితో మాట్లాడను. మేకప్ మేన్ అయితే చేతులు కడుక్కొని, శానిటైజర్ రాసుకున్న తర్వాతే నా ఫేస్ టచ్ చేయాలి. ఫస్ట్ నుంచి నేను ఇంతే అంటూ చెప్పుకొచ్చింది.

Share post:

Latest