మెగా ఫ్యామిలీలో మల్టీస్టారర్ మూవీకి ప్లాన్ చేస్తున్న.. డైరెక్టర్..!

November 2, 2021 at 7:08 am

డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల మల్టీస్టారర్ సినిమాలకి పెట్టింది పేరు. మహేష్ బాబు-వెంకటేష్ తో కలిసి తెరకెక్కించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత తను చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు. ఇక తాజాగా వెంకటేష్ తో కలిసి నారప్ప సినిమా చేశాడు. అయితే ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్, రామ్ చరణ్ లతో ఒక సినిమా తీయబోతున్నారు అనే వార్త వినిపిస్తోంది. అది కూడా ఒక తమిళ సినిమాలో రీమిక్స్ చేయబోతున్నట్లు సమాచారం.

నారప్ప సినిమా తమిళం నుంచి రీమిక్స్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమా కూడా మంచి సక్సెస్ను అందుకుంది. శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమా బాగానే తెరకెక్కించాడని చెప్పుకోవచ్చు. అయితే శ్రీకాంత్ అడ్డాల రాబోయే చిత్రం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఉంటుందని నారప్ప సినిమా ప్రమోషన్లలో చెప్పుకొచ్చారు. కానీ అది ఏమన్నది చెప్పలేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్, అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం.

ఈ కథ చిరంజీవికి , రామ్ చరణ్ కు చెప్పినట్లుగా వినిపిస్తోంది. అయితే ఇందులో మరొక హీరో కూడా ఉండడంతో కథలో కొద్దిగా మార్పులు చేయమని చెప్పినట్టుగా వినిపిస్తోంది. అయితే వీరిద్దరితో శ్రీకాంత్ అడ్డాల మల్టీస్టారర్ సినిమా చేయడానికి సిద్ధపడినట్లు కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో విలన్ గా ఒక హీరో ని తీసుకోబోతున్నట్లు గా సమాచారం

మెగా ఫ్యామిలీలో మల్టీస్టారర్ మూవీకి ప్లాన్ చేస్తున్న.. డైరెక్టర్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts