`భీమ్లా నాయ‌క్‌` వాయిదా..? పోస్ట‌ర్‌తో మేక‌ర్స్ ఫుల్ క్లారిటీ!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `భీమ్లా నాయ‌క్‌`. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీన‌న్‌, సంయుక్త మీన‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అలాగే త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

Bheemla Nayak: The Pawan Kalyan Problem

ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానుంద‌ని మేక‌ర్స్ ఎప్పుడో ప్ర‌క‌టించారు. అయితే అనూహ్యంగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్‌` జ‌న‌వ‌రి 7న రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవ్వ‌డంతో.. సంక్రాంతి బ‌రిలో ఉన్న సినిమాల‌న్నీ సైడ్ అయిపోతున్నాయి.

Image

ఈ నేప‌థ్యంలోనే భీమ్లా నాయ‌క్ కూడా వాయిదా ప‌డ‌నుంద‌ని గ‌త కొద్ది రోజుల నుంచీ జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే తాజాగా ఈ వార్త‌ల‌పై మేక‌ర్స్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. జ‌న‌వ‌రి 12నే భీమ్లా నాయ‌క్‌ చిత్రం విడుద‌ల కానుందంటూ మ‌రోసారి అఫీషియ‌ల్‌గా అదిరిపోయే పోస్ట‌ర్‌తో ప్ర‌క‌టించారు. దీంతో సంక్రాంతి బ‌రిలో ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయ‌క్, రాధే శ్యామ్ మధ్య గ‌ట్టి పోటి ఉండ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.