బిగ్‌బాస్ బిగ్ ట్విస్ట్.. మాన‌స్‌కి భ‌లే క‌లిసొచ్చిందిగా..!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో తొమ్మిదో వారం మొద‌లైంది. ఈ వారం మానస్, సన్నీ, శ్రీరామ్, సిరి, కాజల్, ప్రియాంక, రవి, జెస్సీ, ఆనీ మాస్టర్, విశ్వలు నామినేట్ అయ్యారు. కెప్టెన్ షణ్ముఖ్ తప్పా మిగిలిన ప‌ది మందీ నామినేట్ అవ్వ‌డంతో.. బిగ్ బాస్ వారి మంచి ఆఫ‌ర్ ఇచ్చారు. నామినేట్ అయిన పది మంది సభ్యుల్లో ఒక్కడు మాత్రం తప్పించుకునే అవకాశం కల్పించాడు.

Bigg Boss Telugu 5: Anee pays back for Maanas' sacrifice; uses her special power to save him - Times of India

దానికి ఓ పెద్ద టాస్కే పెట్టేశాడు. ఆ టాస్క్‌లో ఎంతో క‌ష్ట‌ప‌డి ఇంటి స‌భ్యుల‌తో పోరాడి చివ‌ర‌కు ఆనీ మాస్టర్ విన్ అయింది. అయితే యానీ మాస్ట‌ర్ గెల‌వ‌గానే బిగ్ బాస్ మ‌రో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. గతవారం ఓ టాస్క్‌లో విజయం పొందిన యానీ మాస్టర్‌కు బిగ్‌బాస్‌ ఓ స్పెషల్‌ పవర్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆ స్పెషల్‌ పవర్‌ ద్వారా ఒక కంటెస్టెంట్‌ను సేఫ్‌ చేసే అవకాశం ఇచ్చాడు బిగ్‌బాస్‌.

Bigg boss telugu 5: తొలి వారం ఓటింగ్ లో మానస్ దూకుడు.. అతడి గురించి ఈ విషయాలు తెలుసా?

ఈ క్ర‌మంలోనే యానీ మాస్ట‌ర్ ఎంతో ఆలోచించుకుని మాన‌స్‌ను సేవ్ చేసింది. గతంలో మానస్‌ తన కోసం లెటర్ త్యాగం చేశాడు.. డైరెక్ట్ నామినేట్ అయ్యాడు.. అందుకే మానస్‌కు ఇచ్చేస్తున్నాను అని యానీ చెప్పింది. దీంతో ఈ వారం నామినేష‌న్ నుంచి యానీ మాస్ట‌ర్‌తో పాటుగా మాన‌స్ సైతం సేవ్ అయిపోయాడు. మొత్తానికి బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ మాన‌స్‌కి భ‌లే క‌లిసొచ్చింది.

Share post:

Popular