మహేష్ బాబు సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ.. ఎవరంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమాలో మహేష్ బాబు అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కాకముందే మహేష్ తన నెక్ట్స్ చిత్రాల కోసం రెడీ అవుతున్నాడు.

ఈ క్రమంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మహేష్ బాబు ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. కాగా ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కూడా ఉంటుందని, ఆ పాత్ర కోసం పలువురు యంగ్ బ్యూటీల పేర్లను పరిశీలించగా, నభా నటేష్‌ను సెలెక్ట్ చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడు ఈ పాత్రలో మరో బ్యూటీని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. నభా నటేష్ స్థానంలో ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా అందాల భామ లావణ్య త్రిపాఠిని సెలెక్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తోంది. దాదాపు పదకొండేళ్ల తరువాత మహేష్-త్రివిక్రమ్ కాంబో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్‌ను డిసెంబర్ నెలలో మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.