గ్రాండ్‌గా `అఖండ‌` ప్రీ రిలీజ్ ఈవెంట్‌..ఎక్క‌డో తెలుసా?

నంద‌మూరి బాల‌కృష్ణ, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు.

Akhanda Makers Break Their Silence Finally

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన చిత్ర యూనిట్.. అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వ‌హించేందుకు ఇప్ప‌టికే శ్రేయాస్ మీడియా వారితో ఒప్పందం చేసుకున్నారట.

Watch Akhanda Trailer: Nandamuri Balakrishna AKA Balayya's Movie Guarantees To Be Energy-Packed Mass Entertainer (Watch Video) - Google Movie News Youtube HD Video - Latest Breaking News

మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆంద్ర‌ప్రదేశ్‌లో నిర్వహించబోతున్నారట. అందుకోసం వైజాగ్ లో ఒక ప్లేస్ ను సైతం ఎంపిక చేశారని.. మ‌రో రెండు, మూడు రోజుల్లోనే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, ఇప్ప‌టికే అక్క‌డ ఏర్పాట్లు స్టార్ట్ అయ్యాయ‌ని.. అంగరంగ వైభవంగా జరుగనున్న `అ్ండ` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నంద‌మూరి అభిమానుల‌తో పాటుగా టీడీపీ నాయ‌కులు పైతం పాల్గోనున్నార‌ని టాక్‌.

Share post:

Popular