బంగార్రాజు ఫ‌స్ట్ సింగిల్‌..స్వర్గంలో సోగ్గాడి ఆట పాట అదుర్స్‌..!

కింగ్ నాగార్జున ప్ర‌స్తుతం కళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో `బంగార్రాజు` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సోగ్గాడే చిన్ని నాయన మూవీకి ప్రీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న ఈ మూవీలో నాగ చైత‌న్య కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. ర‌మ్య కృష్ణ‌, కృతి శెట్టి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంతవరకు పూర్తైంది. ఈ క్రమంలోనే తాజా షెడ్యూల్‌ను చిత్రబృందం మైసూరులో ప్రారంభించింది. ఇదిలా ఉంటే.. తాజాగా మేక‌ర్స్ ఈ సినిమా ఫ‌స్ట్ సింగిల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. అనూప్ రూబెన్స్ స్వరపరచిన `లడ్డుండా..` అంటూ సాగే ఈ సాంగ్ ఆక‌ట్టుకుంటోంది.

ఇందులో నాగార్జున తెగ ఎంజాయ్ చేసుకుంటూ పాట పాడ‌గా.. ధ‌నుంజ‌య్ ఆయ‌న‌తో జ‌త క‌ట్టారు. అలాగే ఈ సాంగ్‌లో సోగ్గాడు స్వర్గంలో దేవ కన్యల‌తో డ్యాన్సులు చేయ‌డం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. మొత్తానికి అదుర్స్ అనిపిస్తున్న ఈ ఫ‌స్ట్ సింగిల్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి.