`బంగార్రాజు`లో నాగ‌ల‌క్ష్మిగా కృతి శెట్టి..ఫ‌స్ట్ లుక్ అదుర్స్‌!

కింగ్ నాగార్జున‌, ఆయ‌న త‌న‌యుడు నాగ చైత‌న్య క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `బంగార్రాజు`. 2016 లో వచ్చి సూప‌ర్ డూప‌ర్ హిట్టైన‌ సొగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి ప్రీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Akkineni Nagarjuna and Naga Chaitanya's 'Bangarraju' is officially launched | Telugu Movie News - Times of India

అలాగే ఈ మూవీలో నాగ్ స‌ర‌స‌న సీనియ‌ర్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుండ‌గా.. చైతుతో `ఉప్పెన` ఫేమ్ కృతి శెట్టి జోడీ క‌డుతోంది. అయితే తాజాగా కృతి శెట్టిని `నాగ ల‌క్ష్మి`గా ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్‌.. ఆమె ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేశారు.

Promotions begin for Bangarraju

ఇందులో ఊరేగింపు మ‌ధ్యన చీర‌క‌ట్టు, మెడ‌లో దండ ధ‌రించి మెరిసిపోతూ క‌నిపించింది కృతి శెట్టి. మొత్తానికి అదుర్స్ అనిపించేలా ఉన్న కృతి ఫ‌స్ట్ లుక్‌ కుర్ర‌కారును ఆక‌ట్టుకుంటూ.. నెట్టింట వైర‌ల్‌గా మారింది. చూస్తుంటే `బంగార్రాజు`లో నాగలక్ష్మి సందడి నెక్ట్స్ లెవ‌ల్‌లో ఉండనున్నట్టు స్ప‌ష్టంగా అర్థమవుతోంది.

Image

కాగా, అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లో నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన ఫ‌స్ట్ సింగిల్ విశేషంగా ఆక‌ట్టుకోగా.. త్వ‌ర‌లోనే సెకెండ్ సింగిల్ కూడా బ‌య‌ట‌కు రానుంది.

Share post:

Latest