నాగలక్ష్మిగా వ‌స్తోన్న కృతి శెట్టి..`బంగార్రాజు`నుంచి న‌యా అప్డేట్‌!

కింగ్ నాగార్జున‌, ర‌మ్య‌కృష్ణ జంట‌గా క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `బంగార్రాజు`. సోగ్గాడే చిన్నినాయనా చిత్రానికి ప్రీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో నాగ చైత‌న్య‌, కృతి శెట్టిలు జంట‌గా కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

- Advertisement -

Nagarjuna's Bangarraju Launched In Styleప్ర‌స్తుతం మైసూర్‌లో ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి న‌యా అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. విష‌యం ఏంటంటే.. ఈ చిత్రంలో కృతి శెట్టి `నాగ‌ల‌క్ష్మి` అనే గ్రామీణ యువతి పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది.

High Dose Of Glamour For Bangarraju

అయితే ఆమెకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను ఈ నెల 18వ తేదీ ఉదయం 10:18 నిమిషాలకు రివీల్ చేయ‌బోతున్న‌ట్లు తెలుపుతూ చిత్ర యూనిట్ తాజాగా ఓ ప్రీ లుక్‌ పోస్ట‌ర్‌ను వ‌దిలారు. ఇందులో ఆకుపచ్చ గాజులను ధరించి .. రెండు చేతులతో నాగలక్ష్మి నమస్కరిస్తున్నట్టుగా క‌నిపిస్తోంది. ఏదేమైనా ఈ ప్రీ లుక్ చూస్తుంటే కృతి శెట్టి ఖ‌చ్చితంగా ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంద‌ని తెలిసిపోతోంది.

Image

Share post:

Popular