ఇదెక్కడి మాస్ మావా.. అమ్మాయితో మరో అమ్మాయి జంప్ జిలానీ!

బ్రహ్మంగారు కాలజ్ఞానంలో అనేక చిత్రవిచిత్రాలు జరుగుతాయని ముందుగానే చెప్పారు. కానీ ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే, ఆయన చెప్పనివి కూడా చాలానే జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇప్పటికే సమాజంలో వావివరసలు మరిచి చెలరేగిపోతున్న జనం, ఇప్పుడు ఏకంగా లింగబేధన కూడా మరిచి చేస్తున్న పనులు చూస్తుంటే ఈ సమాజం ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. తాజాగా కేరళలో చోటు చేసుకున్న ఓ ఘటనే దీనికి నిలువెత్తు సాక్ష్యం అని చెప్పాలి.

- Advertisement -

కేరళకు చెందిన ఓ యువతి మరో యువతితో జంప్ జిలానీ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. త్రిస్సూల్‌కు చెందిన ఓ యువతి ఇటీవలే ఓ యువకుడిని పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లయినే తెల్లారే వీరిద్దరు బ్యాంకుకు వెళ్లారు. అక్కడ ఇప్పుడే వస్తా అని చెప్పి వెళ్లిన సదరు యువతి, తిరిగి ఎంతసేపటికీ రాకపోవడంతో ఆ భర్త ఆమె కోసం వెతకడం మొదలెట్టాడు. అయితే ఈలోపే ఆ యువతి తన ప్రియురాలితో ఎటో చెక్కేసింది. చేసేదేమీ లేక ఆ యువతి భర్త పోలీసులకు కంప్లైయింట్ ఇచ్చారు. పోలీసులు వీరిద్దరి పట్టుకొని విచారించగా దిమ్మతిరిగే నిజాలను వెల్లడయ్యాయి.

ఈ ఇద్దరు అమ్మాయిలు కొంతకాలంగా ప్రేమించికుంటున్నారని, కేవలం బంగారం కోసం ఆ యువకుడిని పెళ్లాడినట్లు సదరు యువతి పేర్కొంది. మరోవైపు ఇంకో అమ్మాయి సైతం ఇదేవిధంగా పెళ్లి చేసుకొని ఇంటి నుంచి పరారైనట్లు తెలిపింది. ఈ కథ విన్న ఆ భర్తకు అక్కడిక్కడే గుండెపోటు వచ్చింది. దీంతో అతడిని హుటాహుటిన ఆసుపత్రిలో చేర్చారు. ఏదేమైనా ఇద్దరు అమ్మాయిులు చేసిన పనికి ఓ అమాయకుడు బలయ్యాడని ఈ విషయం తెలుసుకున్న పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయినా అమ్మాయి అమ్మాయి లేచిపోవడం ఏమిటిరా నాయనా అంటూ మరికొందరు తలలు పగలగొట్టుకుంటున్నారు!

Share post:

Popular