ప్రేమలో విఫలమైన కంగ‌నా.. అస‌లు క‌థ అదేనా..?

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, కాంట్ర‌వ‌ర్సీ క్వీన్‌ కంగ‌నా ర‌నౌత్ గురించి ప్రత్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌సరం లేదు. హిందీ సినీ ప‌రిశ్ర‌మ‌లో గొప్ప న‌టిగా గుర్తింపును పొందించిన ఈ భామ‌.. మ‌రోవైపు నిత్యం ఏదో ఒక విష‌యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారుతుంటుంది. ఇక ఈ మ‌ధ్య భారత్‌కు ‘అసలైన స్వాతంత్య్రం’ 2014లోనే వచ్చిందంటూ బీజేపీకి మద్ధతుగా వ్యాఖ్య‌లు చేసింది.

దీంతో స్వాతంత్య్ర సమరయోధులను అవమానించిందంటూ కంగ‌నాపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు, ఈ విష‌యంలో నెటిజ‌న్లు సైతం ఆమెపై విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే ఇలాంటి త‌రుణంలో కంగ‌నా తాజాగా చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. `నేను నిన్ను ప్రాణంగా ప్రేమించాను.. కానీ, నువ్వు నన్ను మోసం చేశావు`అనే అర్ధం వచ్చేలా హిందీలో తన మనోభావాలను రాసుకొచ్చింది.

దీంతో కంగ‌నా ప్రేమ‌లో విఫ‌ల‌మైందంటూ బీటౌన్‌లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవలే ఆమె నాకు తల్లి కావాలనుంది .. త్వరలోనే నా ప్రేమికుడిని పరిచయం చేస్తానని చెప్పింది. ఇంతలోనే బ్రేక‌ప్ పోస్ట్‌ను పెట్ట‌డంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్నారు.

అయితే కంగ‌నా పోస్ట్ వెన‌క మ‌రో క‌థ‌నం కూడా వినిపిస్తోంది. స్వాతంత్య్ర సమరయోధులను అవ‌మానించిన విష‌యంలో ప్ర‌స్తుతం త‌న‌పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆ విషయం నుంచి నెటిజ‌న్ల‌ను డైవర్ట్ చేయడానికి కంగన ఇలా పోస్ట్ పెట్టిందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో ఆమెకే తెలియాలి.

 

Share post:

Latest