పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కంగ‌నా..త్వ‌ర‌లోనే గుడ్‌న్యూస్‌!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎలాంటి డొంక తిరుగుడు లేకుండా ఉన్న‌ది ఉన్న‌ట్లు మాట్లాడుతూ కాంట్ర‌వ‌ర్సీ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న‌ ఈ భామ‌.. మ‌రోవైపు మంచి న‌టిగా, ద‌ర్శ‌కురాలిగా కూడా స‌త్తా చాటుతోంది.

Hotness Alert!': Kangana Ranaut impresses fans with her BOLD look from 'Dhaakad' wrap party

హీరోయ‌న్‌గా త‌న‌కంటూ ఓ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న కంగ‌నా.. ఇటీవ‌ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే.. త్వ‌ర‌లోనే ఈ బ్యూటీ పెళ్లి పీట‌లెక్క‌బోతోంది. ఈ విష‌యాన్ని ఎవ‌రో కాదు.. కంగ‌నానే స్వ‌యంగా తెలిపింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో కంగ‌నా పాల్గొన‌గా..రాబోయే ఐదేళ్ల‌లో ఎలా క‌నిపించ‌బోతున్నారు అని ప్ర‌శ్నించారు.

Kangana Ranaut reveals she is feeling despaired among passport renewal row!

అందుకు ఆమె రాబోయే ఐదేళ్ల‌లో త‌ల్లిగా న‌న్ను నేను చూడాల‌ని కోరుకుంటున్నాను. త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకొని పిల్ల‌ల్ని కనాల‌ని ఉంద‌ని కంగ‌నా ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చింది. దీంతో మీ జీవితంలో ఎవరైనా ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తి ఉన్నారా? అంటే అవున‌ని పేర్కొన్న కంగ‌నా.. ఆ వ్య‌క్తి గురించి అతి త్వ‌ర‌లోనే అంద‌రికీ తెలుస్తుంద‌ని బ‌దులిచ్చింది. ఇక కంగ‌నా మాట‌ల బ‌ట్టీ చూస్తుంటే.. ఆమె మ‌రికొద్ది రోజుల్లోనే పెళ్లికి సంబంధించిన గుడ్‌న్యూస్ చెప్ప‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Share post:

Latest