జై భీమ్ సినిమాకు.. సపోర్టుగా కాంగ్రెస్..!

తమిళ స్టార్ హీరో సూర్య, టి.జే. జ్ఞానవేల్ డైరెక్షన్లో తెరకెక్కించిన చిత్రం జై భీమ్. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా అందరి ప్రశంసలు అందుకుంటోంది. న్యాయం కోసం ఓ ఆడబిడ్డ, పోరాడిన విధానం ప్రతి ఒక్కరి హృదయాలను కరిగించింది. ఈ సినిమాను చూసిన పలువురు సిని రాజకీయ ప్రముఖులు, హీరో సూర్య చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

అయితే తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీత కూడా, తన ట్విట్టర్ వేదికగా సూర్యా కు అభినందనలు తెలియజేసింది. ఈ సినిమా ఖచ్చితంగా ఆస్కార్ బరిలో నిలుస్తుందని ఆశిస్తున్నానని తెలియజేసింది. అవార్డు కూడా సాధించాలని కోరుకుంటున్నాను అని , చిత్ర బృందానికి ముందస్తుగా నా అభినందనలు అని తెలియజేసింది. సీతక్క చేసిన ట్వీట్ కు హీరో సూర్య స్పందిస్తూ.. మా చిత్ర బృందం తరపున మీకు కృతజ్ఞతలు మేడం అని రిప్లై ఇచ్చారు. ఇక రాబోయే రోజుల్లో ఈ సినిమా ఆస్కార్ అవార్డు కొడుతుందేమో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Share post:

Latest