శ్రీ‌దేవి ముద్దు కోసం నోరు కడుక్కుని వెళ్లిన న‌టుడు ఎవ‌రో తెలుసా?

తన‌దైన‌ అందం, అభినయం, న‌ట‌న‌తో యావత్ భారతదేశ సినీ ప‌రిశ్ర‌మ‌ను కొన్నేళ్ల పాటు ఏలిన‌ దివంగ‌త‌ నటి, అతిలోక సుందరి శ్రీ‌దేవి అంటే తెలియ‌ని వారుండ‌రు. కోట్లాది ప్రేక్ష‌కుల‌తో పాటుగా తోటి తార‌ల‌ను త‌న అభిమానులుగా మార్చుకున్న శ్రీ‌దేవితో.. ఒక్క సినిమా చేసినా చాలు అని ఎంతో మంది హీరోలు, దర్శకులు ఎదురు చూసేవారు.

ఈ లిస్ట్‌లో న‌టుడు జేడీ చ‌క్ర‌వ‌ర్తి ఒక‌రు. టాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన `శివ‌` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జేడీ చ‌క్ర‌వ‌ర్తి.. మనీ, అనగనగా ఒక రోజు, ప్రేమకు వేళాయెరా, సత్య, గులాబి లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే ‘క్షణ క్షణం’ సినిమాలో శ్రీదేవి తో కలిసి నటించే ఛాన్స్‌ను కొట్టేసి త‌న క‌ల‌ను నెర‌వేర్చుకున్నాడు.

అయితే క్షణ క్షణం చిత్రానికి ముందు జేడీ చక్ర‌వ‌ర్తి నటించిన ‘మనీ’ మూవీని చూసిన శ్రీ‌దేవి.. ఆయ‌న‌కు అదిరిపోయే కాంప్లిమెంట్ ఇచ్చిందట. `నేను ఇప్పటివరకు చూసిన ఇద్దరు బెస్ట్ యాక్టర్స్‌ లో మీరు కూడా ఒకరు` అని శ్రీ‌దేవి అన్నార‌ట‌. ఇంకేముంది.. శ్రీ‌దేవి ఇచ్చిన కాంప్లిమెంట్‌కు జెడీ ఆనందంతో గాల్లో తేలిపోయార‌ట‌.

అంతేకాదు.. పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చినందుకు కనీసం హగ్ అయినా చేసుకుంటుందేమో లేదా ముద్దు పెడుతుందేమో అనుకుని మౌత్ వాష్ చేసుకుని వెంట‌నే శ్రీదేవి వ‌ద్దకు వెళ్లి హ‌లో మేడమ్ అన్నార‌ట జేడీ. కానీ, ఆమె మాత్రం ఏమి రియాక్ట్ అవ్వకుండా వెళ్లిపోయింద‌ట‌. దాంతో ఎంతో బాధ క‌లిగింద‌ని జేడీ చ‌క్ర‌వ‌ర్తి గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Share post:

Latest