స్టార్ కమెడియన్ ఆలీ ఆస్తుల విలువెంతో తెలిస్తే మైండ్‌బ్లాకే?!

ఆలీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బాల‌న‌టుడిగా సినీ కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఆలీ.. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనే స్టార్ క‌మెడియ‌న్‌గా గుర్తింపును సంపాదించుకున్నాడు. దాదాపు నాలుగు దశాబ్ధాలకు పైగా తెలుగు తెరపై నవ్వుల పువ్వులు పూయిస్తున్న ఆలీ.. వెండితెరపై వ‌రుస సినిమాల్లో న‌టిస్తూనే బుల్లితెరపై సీరియల్స్‌, రియాలిటీ షోలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు.

ఈ క్ర‌మంలోనే స్టార్ట్ హీరోల‌కు మించి ఆస్తుల‌ను కూడ‌బెట్టాడు. ఆలీ ఆస్తుల విష‌యానికి వ‌స్తే.. సంవ‌త్స‌రానికి రూ.9 కోట్ల‌ నుంచి 12 కోట్ల వ‌ర‌కు సంపాదించే ఆయ‌న‌కు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లో రూ.3 కోట్ల విలువ చేసే ఇల్లు.. కొన్ని లక్షల రూపాయల ఖ‌రీదు చేసే సూపర్ లగ్జరీ కార్లు ఉన్నాయి.

అలాగే సొంత ప్రాంతంలో ఆలీకి కోట్లు విలువ చేసే వ్యవసాయ పొలాలు కూడా ఉన్నాయ‌ట‌. ఇక సినిమాల ద్వారా, సీరియల్స్ ద్వారా, రియాల్టీ షోల ద్వారా మ‌రియు ఇతర బిజినెస్ ల ద్వారా సంపాదిస్తున్న ఆలీ ఆస్తుల విలువ మొత్తం రూ.800 కోట్ల‌ వ‌ర‌కు ఉంటుంద‌ని టాక్‌.

కాగా, తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఒక పేద ముస్లిం కుటుంబంలో జ‌న్మించిన ఆలీ..కెరీర్ తొలినాళ్లలో జంధ్యాల సినిమాల్లో చిన్న చిన్న వేశాలు వేసేవాడు. ఆ తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి, ఇ.వి.వి. సత్యానారాయణ లాంటి దర్శకుల చేతిలో ప‌డి హాస్య న‌టుడిగా రాటుదేలిన ఆలీ తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిలో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని సంపాదించుకున్నాడు.