శ్యామ్ సింగ రాయ్‌పై కన్నేసిన స్టార్ హీరో

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’పై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నాని సరికొత్త లుక్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్ ఇప్పటికే ఈ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేయగా, ఈ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

అయితే ఈ సినిమాలో నాని రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండగా, కోల్‌కతా నేపథ్యంలో సాగే ఈ సినిమా కథలో నాని పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా శ్యామ్ సింగ రాయ్ పాత్రలో నాని పర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉంటుందని చిత్ర వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇక ఈ సినిమా కంటెంట్ గురించి తెలుసుకున్న ఓ బాలీవుడ్ స్టార్ హీరో, ఇప్పుడు ఈ సినిమాపై కన్నేశాడట. బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ శ్యామ్ సింగ రాయ్ సబ్జెక్ట్ గురించి తెలుసుకుని చాలా ఇంప్రెస్ అయినట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

దీంతో ఆయన ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని ఆలోచిస్తున్నాడట. ఈ మేరకు సినిమా రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం పక్కనబెడితే, ఒకవేళ నిజంగా హృతిక్ రోషన్ ఈ సినిమాను రీమేక్ చేస్తే మాత్రం అది ఖచ్చితంగా బాలీవుడ్ జనాలను ఆకట్టుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ సినిమా బాలీవుడ్‌లోకి వెళ్తుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

Share post:

Latest