సీనియర్ హీరో స్నేహ ఇద్దరు వ్యాపారవేత్తల చేతుల్లో అడ్డంగా మోసపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాజాగా స్నేహ చెన్నైలోని కానత్తూర్ పోలీస్ స్టేషన్‌లో ఓ ఇద్దరు వ్యాపారవేత్తల పైన కేసు ఫైల్ చేసింది. సదరు వ్యాపార వేత్తలిద్దరూ ఎక్స్ పోర్ట్ కంపెనీని నిర్వహిస్తున్నారు. వారి కంపెనీలో చాలా రోజుల నుంచి స్నేహ కూడా మనీ ఇన్వెస్ట్ చేసింది.
అయితే స్నేహ 26 లక్షల డబ్బు ఇన్వెస్ట్ చేయగా.. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఆమెకు రిటర్న్ చేయలేదట. దీంతో ఆమె తన డబ్బుని వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని డిమాండ్ చేయగా.. వారు బెదిరింపులకు పాల్పడ్డారని స్నేహ తన ఫిర్యాదులో పేర్కొంది.
స్నేహ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. కాగా, తొలివలపు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ..హనుమాన్ జంక్షన్, శ్రీరామదాసు, సంక్రాంతి, రాధాగోపాళం వంటి చిత్రాలతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది.
మరోవైపు తమిళంలోనూ పలు చిత్రాలు చేసిన ఈ అమ్మడు.. నటుడు ప్రసన్నను 2012లో వివాహం చేసుకుని చెన్నైలో సెటిల్ అయింది. ఇక ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.