హీరో సూర్య పై దాడి చేస్తే రూ.లక్ష రివార్డ్ ప్రకటించిన పార్టీ..!!

ఈ మధ్య కోలీవుడ్ స్టార్ హీరోలకు బెదిరింపులు ఎక్కువయ్యాయని చెప్పాలి.. పైగా ఆ బెదిరింపులు ఎలా ఉన్నాయి అంటే, వారిని ఎవరైనా కొడితే కొట్టిన వాళ్లకు రివార్డులు కూడా ప్రకటిస్తున్నారు కొంతమంది.. తాజాగా జై భీమ్ సినిమాతో యదార్థగాథ తెరకెక్కించి మంచి సక్సెస్ఫుల్ విజయాన్ని అందుకున్న హీరో సూర్యకు కూడా ఇలాంటి బెదిరింపులు ఎక్కువయ్యాయి.. అంతే కాదు సూర్య ని కొట్టిన వాళ్లకు ఏకంగా లక్ష రూపాయల రివార్డు కూడా ఇస్తామని ఒక పార్టీ నేతలు ప్రకటించడం ప్రస్తుతం సంచలనంగా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే, జ్ఞానవేల్ దర్శకత్వంలో, సూర్య హీరోగా వచ్చిన చిత్రం జై భీమ్..ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలై అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోయింది. మతపరమైన చిహ్నాన్ని కలిగి ఉన్న సన్నివేశంపై ప్రేక్షకులలో ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఈ సినిమా మేకర్స్ సినిమాలో కొన్ని సన్నివేశాలను సవరించినప్పటికీ వివాదాలు మాత్రం సద్దుమణగలేదు.కుల అల్లర్లను రెచ్చగొట్టి వన్నీ వన్నియార్ కమ్యూనిటీని అవమానించిన నటుడు సూర్య మైలాడుతురై జిల్లాకు వస్తే, అతనిపై దాడి చేసిన యువకులకు పార్టీ తరపున లక్ష రూపాయల బహుమతి ఇస్తామని సంచలన ప్రకటన చేశాడు.

ఇకపోతే ఈ బెదిరింపుల మధ్య సూర్యకు మద్దతుగా ఇంటర్నెట్‌లో పలువురు ట్వీట్లు చేస్తున్నారు. #WeStandWithSuriya అనే ట్యాగ్ ప్రస్తుతం సూర్యకు సపోర్ట్ గా ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది. అభిమానులు మాత్రమే కాదు సినీ సెలబ్రిటీలు కూడా సూర్యకు మద్దతుగా నిలుస్తున్నారు.

Share post:

Latest