పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. త్వరలోనే ఆ సినిమా సెట్స్ పైకి..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై భారీ చిత్రాల నిర్మాత ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల కిందటే మొదలైంది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడింది.

ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిన తర్వాత క్రిష్ వైష్ణవ్ తేజ్ హీరోగా కొండపొలం అనే సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయింది. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు సినిమా అతి త్వరలోనే తిరిగి సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇందుకు సంబంధించి క్రిష్ తన టీంతో లొకేషన్ల వేటలో పడ్డాడు. లొకేషన్ల సెలక్షన్ పూర్తయిన వెంటనే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అర్జున్ రాంపాల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి ఇండియా సినిమా కూడా ఇదే.

Share post:

Latest