గని కి సహాయపడుతున్న అల్లూరి సీతారామరాజు ..!

November 15, 2021 at 7:09 am

వరుణ్ తేజ్ హీరోగా, సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం గని, ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాని డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు హీరో వరుణ్ తేజ్, ఆయన అభిమానులు కూడా. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదలైన వీడియోస్, పోస్టర్స్ బాగా వైరల్గా మారాయి.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక అప్డేట్ కూడా రాబోతున్నట్లు గా తెలుస్తోంది. ఈ చిత్రం టీజర్ ను ఈరోజు ఉదయం 11:08 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా టీజర్ కు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఉండనుంది అన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలియడంతో టీజర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే ఈ సినిమాలో పోస్టర్స్ లో వరుణ్ తేజ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాకి రామ్ చరణ్ వాయిస్ ఓవర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని డిసెంబర్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

గని కి సహాయపడుతున్న అల్లూరి సీతారామరాజు ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts