చిరంజీవి 154వ చిత్రం మాస్ లుక్ అదుర్స్..!!

ఖైదీ నెంబర్ 150 సినిమా తో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మెగాస్టార్ మంచి దూకుడు మీద ఉన్నాడు అని చెప్పాలి .ఇప్పటికే ఆయన..తన కొడుకు రామ్ చరణ్ తో కలిసి ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేశారు ప్రస్తుతం గాడ్ ఫాదర్, బోలా శంకర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న చిరంజీవి 154వ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా శనివారం పూర్తి చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాస్ లుక్ కు సంబంధించిన ఒక పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది . ఇందులో చిరంజీవి లైటర్ వెలిగిస్తూ, సిగరెట్ కాలుస్తూ ఉన్నట్టు మనకు పక్కా మాస్ లుక్ లో కనిపిస్తాడు.

బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్ వాళ్లు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు బాబి తన సోషల్ మీడియా ద్వారా చిరంజీవి గురించి ఇలా ట్వీట్ చేశాడు. “మెగాస్టార్, ఆయన పేరు వింటే…అంతు లేని ఉత్సాహం! ఆయన పోస్టర్ చూస్తే..అర్ధం కాని ఆరాటం.. తెర మీద ఆయన కనబడితే…ఒళ్ళు తెలీని పూనకం, పద్దెనిమిదేళ్ల క్రితం….ఆయన్ని మొదటి సారి కలసిన రోజు కన్న కల… నిజమవుతున్న ఈ వేళ మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాను.” అని ట్వీట్‌లో పేర్కొన్నాడు.

Share post:

Latest