భోళా శంకర్ లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన మిల్క్ బ్యూటీ..!

ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనుకున్న చిత్రం భోళా శంకర్.. ఈ చిత్రాన్ని మాస్, యాక్షన్, థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించబోతున్నారు. ఇక తమిళంలో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న అజిత్ వేదాళం ను చిత్రానికి అఫీషియల్ రీమేక్ ఈ సినిమా అన్న విషయం తెలిసిందే.. అన్నా చెల్లెలు సెంటిమెంట్ తో సాగే ఈ సినిమా కలకత్తా బ్యాక్ డ్రాప్ లో జరిగిన ఒక కథను ఆధారంగా తీసుకొని రూపొందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను ఈనెల 11వ తేదీన పూజా కార్యక్రమాలతో చాలా గ్రాండ్ గా చేయబోతున్నారు. ఇక 15వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది..

Megastar Chiru Picked Tamanna Over Her Friend -
చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుండగా, ఇక ఆయనకు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నాను అధికారికంగా ఖాయం చేస్తూ ట్విట్టర్ వేదిక గా ప్రకటించారు సినిమా మేకర్స్..

 

ఇక దానిని గౌరవం గా భావిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇప్పటికే వీరిద్దరూ సైరా నరసింహారెడ్డి చిత్రంలో కలిసి నటించారు. ఇక ఆమె ఈ అవకాశాన్ని కూడా వదులుకోకుండా వచ్చిన వెంటనే అంగీకరించింది తమన్నా.. అంతేకాదు దీనికోసం భారీగానే రెమ్యూనరేషన్ అందుకుంటుందని కూడా సమాచారం.

Share post:

Latest