టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు తాజా చిత్రం `అర్జున ఫల్గుణ`. తేజ మర్ని దర్శత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అయితే తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. `నాది కాని కురుక్షేత్రంలో నాకు తెలియని పద్మవ్యూహంలో కూరుకు పోయాను.. అయినా బలై పోవడానికి నేను అభిమాన్యుణ్ణి కాదు.. అర్జునుణ్ణి` అని శ్రీవిష్ణు చెప్పే డైలాగ్ తో ప్రారంభమైన ఈ టీజర్ ఆధ్యంతం సూపర్ థ్రిల్లింగ్ కొనసాగింది.
క్యాచి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లో పాత్రలన్నీ చూపిస్తూ యాక్షన్, ఎమోషన్ మిక్స్ చేసి టీజర్ ని కట్ చేశారు. డైలాగ్స్ మరియు విజువల్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీరాభిమాని అయిన శ్రీవిష్ణు పక్కా ఊర మాస్ రోల్లో కనిపించబోతున్నాడు. మొత్తానికి అదిరిపోయిన తాజా టీజర్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది. కాగా, ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.