పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం భీమ్లా నాయక్.. ఈ సినిమాలో మరొక హీరో దగ్గుబాటి రానా కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాని మలయాళంలో సూపర్ హిట్ చిత్రమైన అయ్యప్పన్ కోసం. చిత్రాన్ని రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, డైలాగ్స్ అందిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రం నుండి ఇప్పటి వరకు విడుదలైన పలు పోస్టర్స్, వీడియోలు, పాటలు సినిమా పై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి “లాల భీమ్లా పాటను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. అందుకోసం ఈ సినిమా నుండి ఒక పోస్టర్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ పాటకు సంబంధించి ప్రోమో ఈరోజు సాయంత్రం 7:02 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది.
పవన్ కళ్యాణ్, రానా కలిసి మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్ అందిస్తున్నాడు
Let's celebrate this diwali with #TheSoundOfBheemla 🥁❤️🔥#LalaBheemla Video Promo out today at 07:02pm🔥#BheemlaNayak @pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @iamsamyuktha_ @dop007 @NavinNooli @vamsi84 @adityamusic pic.twitter.com/rOf6nqGQXG
— Sithara Entertainments (@SitharaEnts) November 3, 2021