బాల‌య్య‌కు స‌ర్జ‌రీ..ఆందోళ‌నలో ఫ్యాన్స్‌..అస‌లేమైందంటే?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హాస్ప‌ట‌ల్‌లో అడ్మిట్ అయ్యారు. కుడి భుజం తీవ్రంగా నొప్పి పుట్ట‌డంతో.. బాల‌య్య వెంట‌నే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‏ కేర్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఈ నేప‌థ్యంలోనే అక్క‌డి వైద్య నిపుణులు నేడు ఆయన కుడి భుజానికి సర్జరీ నిర్వహించారు.

అయితే ఈ విష‌యం తెలుసుకున్న అభిమానులు మ‌రియు టీడీపీ నేత‌లు ఆందోళ‌న చెందుతుండ‌గా.. కేర్‌ ఆసుపత్రి వైద్యులు తాజాగా బాల‌య్య హెల్త్ బులిటెన్ విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం బాల‌య్య ఆరోగ్యంగా బాగానే ఉంద‌ని..ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

మ‌రియు త్వరలోనే ఆయనను డిశ్చార్జ్‌ చేస్తామని కూడా వైద్యులు స్పష్టం చేశారు. దాంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం బాల‌య్య బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ చిత్రం చేశారు. ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవి విడుద‌లకు సిద్ధంగా ఉంది. ఇక అఖండ‌ త‌ర్వాత బాల‌య్య గోపీచంద్ మాలినేనితో ఓ సినిమా చేయ‌నున్నాడు. త్వ‌ర‌లోనే ఇది సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతోంది.

Share post:

Popular