బుల్లెట్టు బండెక్కి వస్తున్న పుష్పరాజ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంత ఆశగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్రలో ఊరమాస్ లుక్‌లో బన్నీ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి.

పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమా పూర్తిగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రాబోతుంది. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అదనపు బలంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన మూడు లిరికల్ సాంగ్స్‌కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ దక్కడంతో ఇంకా ఈ సినిమాలో ఎలాంటి పాటలు ఉన్నాయా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో మరో మాస్ సాంగ్ రాబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది. ఈమేరకు ఈ పాట షూటింగ్‌కు సంబంధించిన స్టిల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఫోటోలో బన్నీ పుష్పరాజ్‌గా ఊరమాస్ లుక్‌లో బుల్లెట్టు బండిపై కూర్చుని కనిపిస్తున్నాడు. ఇక ఈ పాటలో ఏకంగా వెయ్యి మంది డ్యాన్సర్లు ఉన్నట్లు చిత్ర యూనిట్ అంటోంది. ఈ పాట ఇప్పటివరకు వచ్చిన సాంగ్స్‌ను మించి ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఏదేమైనా ఈ పాటకు సంబంధించిన స్టిల్ ఈ రేంజ్‌లో వైరల్ అవుతుండటంతో, ఈ పాట ఇంకెంత వైరల్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఈ పాటను చిత్ర యూనిట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.