బాక్సాఫీస్ వద్ద తుస్సుమన్న టపాసులు..?

November 5, 2021 at 6:28 pm

కరోనా తీవ్రత తగ్గిన తర్వాత సినిమాలు తీయటర్ లో ఒక్కొక్కటిగా విడుదల అవుతూ ఉన్నాయి. అయితే ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలను చూసి ప్రజలు థియేటర్ల వైపు రావడం మొదలుపెట్టారు. ఇక ఇదే క్రమంలో దీపావళి పండుగ రోజున ఎన్నో సినిమాలు విడుదల అయినప్పటికీ అవి ఏమాత్రం ప్రజలను ఆకర్షించాయి ఇప్పుడు ఒకసారి చూద్దాం.

1). మారుతి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం మంచి రోజులు వచ్చాయి. ఈ సినిమాపై భారీ అంచనాలను కూడా పెట్టుకున్నారు నిర్మాతలు హీరో హీరోయిన్లు. కథ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మిక్స్డ్ కాకుంటే పరిమితమైంది.

2). రజనీకాంత్ నటించిన తాజా చిత్రం పెద్దన్న. మాస్ డైరెక్టర్ శివ ఈ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమాలో హీరోయిన్ నయనతర, కీర్తి సురేష్, మీనా, కుష్బూ, ప్రకాష్ రాజ్, జగపతి వంటి వారు నటించినప్పటికీ.. కథ మెప్పించలేక పోవడంతో ఈ సినిమా కూడా తుస్సు మంది.

3). కోలీవుడ్ హీరో విశాల్-ఆర్య కలిసి చేసిన భారీ యాక్షన్ సినిమా ఎనిమి. ఈ సినిమాలో యాక్షన్ సీన్లు తప్ప మిగతా సీన్లు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరుత్సాహ పరిచింది.

దీపావళి పండుగ కావడం చేత తెలుగు రాష్ట్రంలోని ప్రజలు థియేటర్లలో వచ్చినప్పటికీ ఒక మోస్తారు కలెక్షన్లను రాబట్టాయి. అయితే ఈ సినిమాలు ఎంతటి కలెక్షన్ రాబడతాయో వేచి చూడాలి.

బాక్సాఫీస్ వద్ద తుస్సుమన్న టపాసులు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts