నాగ్‌కి నో చెప్పి ఇప్పుడు ఫీల‌వుతున్న అమలా పాల్..?

అమ‌లా పాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నాయ‌క్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కేర‌ళ కుట్టి.. తెలుగులో చేసింది త‌క్కువ సినిమాలే అయినా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను ఏర్ప‌ర్చుకుంది. ఇక ఈ మ‌ధ్య కుడి ఎడమైతే వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న అమ‌లా పాల్‌.. తాజాగా ఒక బిగ్ ప్రాజెక్ట్‌ను వ‌దులుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

Buzz: Amala Paul to romance Nagarjuna? | Manacinema

టాలీవుడ్‌ మన్మథుడిగా పేరు సంపాదించుకున్న కింగ్ నాగార్జున ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కి `ఘోస్ట్` అనే టైటిల్‌ను కూడా ఖ‌రారు చేశారు. అలాగే ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని చిత్ర యూనిట్ ముందే ప్ర‌క‌టించింది.

On his birthday, Nagarjuna's upcoming movie title revealed as The Ghost | The News Minute

అయితే ప‌లు కార‌ణాల వ‌ల్ల ఆమె ఈ సినిమా నుంచి త‌ప్పుకుంది. దీంతో మూవీ మేక‌ర్స్ నాగ్‌కి జోడీగా న‌టించాలంటూ అమ‌లా పాల్‌ను సంప్ర‌దించారు. కానీ, ఆమె రెమ్యూన‌రేష‌న్ కార‌ణంగా నో చెప్పింద‌ట‌. దీంతో చేసేదేమి లేక మేక‌ర్స్‌ మ‌రో హీరోయిన్‌ను వెతికే ప‌నిలో ప‌డ్డార‌ట‌.

Amala Paul replaces Kajal Aggarwal opposite Nag

అయితే సీనియర్ హీరోల జోడీగా హీరోయిన్స్ దొరకని ఈ పరిస్థితుల్లో అమలా పాల్ ఒప్పుకుని ఉంటే, ఆమెకి మరిన్ని అవకాశాలు వచ్చి ఉండేవనే అభిప్రాయాలు జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో నాగ్‌కి నో చెప్పి త‌ప్పు చేశాన‌ని అమ‌లా పాల్ ఫీల్ అవుతున్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

 

Share post:

Latest