సినీ ఇండస్ట్రీలో మోహన్ బాబు అంటే ఎంత గౌరవం ఉందో మనకు తెలిసిన విషయమే. ఇక ఆయన కూతురు మంచు లక్ష్మి కూడా అందరికీ సుపరిచితమే. అయితే తాజాగా అల్లు అర్జున్ మంచు లక్ష్మీ పై కొన్ని వ్యాఖ్యలు చేశాడని తెలుస్తోంది వాటి గురించి చూద్దాం.
అల్లు అర్జున్ AHA 2.0 ని యాప్ ను విడుదల చేయడానికి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ ఈ కార్యక్రమానికి ఎంతో మంది అతిథులు కూడా వచ్చారు. కార్యక్రమంలో మంచు లక్ష్మి కూడా పాల్గొన్నది. ఇక మంచు లక్ష్మి ని అల్లు అర్జున్ స్టేజ్ పైకి పిలవగా.. మంచు లక్ష్మి ని తెలుగులోనే మాట్లాడమని సూచించారు అల్లు అర్జున్. ఇది ఆహా తెలుగు ప్రోగ్రామ్ కాబట్టి ప్రజలకు అర్థమయ్యే భాష లోనే మాట్లాడమని సైలెంట్ గా సెటైర్ వేశాడు స్టైలిష్ స్టార్.
ఇక ఈ విషయంపై మంచు లక్ష్మి కూడా.. మాట్లాడుతూ నాకు అర్థమైన తెలుగు భాషలోనే నేను మాట్లాడతానని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా మంచు లక్ష్మి నేను ఇప్పటివరకు ఎన్నో షోలకు యాంకర్ గా చేశాను. మరికొన్ని షోలకు గెస్ట్ గా కూడా హాజరయ్యారు అని చెప్పుకొచ్చింది.
ఇక ఇదే తరుణంలోనే అల్లు అర్జున్ మాట్లాడుతూ.. తాజాగా ప్రెసిడెంట్ గారి అక్కకు కూడా కౌంటర్ వేసాడు. దీంతో మంచు లక్ష్మి అయ్యో అయ్యో అనుకుంటూ మళ్లీ తలపట్టుకుంది. ఈ ప్రెసిడెంట్ గోలతో నాకు కష్టాలు చాలా వచ్చాయని తెలిపింది మంచు లక్ష్మి. అయితే ఇదంతా కేవలం అక్కడ స్టేజి మీద ఫన్నీ గా ఉండే అందుకే చేశారు అన్నట్లుగా సమాచారం.