ఆ పుకార్ల‌కు తెర దించిన బ‌న్నీ..ఫుల్ ఖుషీలో మెగా ఫ్యాన్స్‌!

మెగా ఫ్యామిలీ అనగానే చిరంజీవి-అల్లు అరవింద్‌ కుటుంబాలే అంద‌రికీ గుర్తుకు వ‌స్తాయి. అంతలా ఈ కుటుంబాల మధ్య బంధం అల్లుకుపోయింది. కానీ, గ‌త కొంత కాలం నుంచీ వారి బంధానికి బీట‌లు వారాయ‌ని, ఆ రెండు ఫ్యామిలీల మ‌ధ్య దూరం పెరిగింద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

Image

అయితే ఈ పుకార్ల‌కు బ‌న్నీ తెర దించారు. నేడు దీపావ‌ళి సంద‌ర్భంగా బ‌న్నీ ఓ ఫొటోను పోస్ట్ చేసి అంద‌రికీ దివాళీ విషెస్ తెలిపాడు. ఇక ఆయ‌న షేర్ చేసిన ఫొటోలో కొణిదెల-అల్లు ఫ్యామిలీల‌కు చెందిన యంగ‌ర్ జ‌న‌రేష‌న్ అంతా క‌నిపిస్తున్నారు.

Photo: A candid portrait of Mega heroes seems to be just perfect | Telugu Movie News - Times of India

అల్లు అర్జున్ – స్నేహ‌, రామ్ చ‌ర‌ణ్‌- ఉపాస‌న‌, అల్లు బాబీ, నిహారిక‌ – చైత‌న్య, వైష్ణ‌వ్ తేజ్ త‌దిత‌రులు ఈ ఫొటోలో ఉన్నారు. మొత్తానికి ఒక్క‌ ఫొటోతో కొణిదెల-అల్లు ఫ్యామిలీల మ‌ధ్య ఎటువంటి మనస్పర్థలు లేవ‌ని బ‌న్నీ ప‌రోక్షంగా చెప్ప‌క‌నే చెప్పేశాడు. ఈ నేప‌థ్యంలోనే మెగా ఫ్యాన్స్ బ‌న్నీ షేర్ చేసిన ఫొటోను చూసి ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

Share post:

Latest