ఫాంహౌస్‌లో భార్య‌తో బ‌న్నీ పార్టీ..వైర‌ల‌వుతున్న వీడియో!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్ పుష్ప ది రైజ్ పేరుతో డిసెంబ‌ర్ 17 విడుద‌ల చేయ‌నున్నారు.

Allu Arjun and Sneha Reddy's Diwali video is lit: Watch | Telugu Movie News - Times of India

ఇదిలా ఉంటే.. బ‌న్నీ ఇటీవ‌ల త‌మ ఫాంహౌస్ లో దివాళీ పార్టీని భార్య‌తో క‌లిసి గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకున్నాడు. అందుకు సంబంధించి వీడియోను తాజాగా బ‌న్నీ షేర్ చేస్తూ..ఫాంహౌస్‌ లో దీపావళి పార్టీ చేసుకున్నామ‌ని, ఈ అలంకరణకు కారణం త‌న భార్య‌ స్నేహనే అని పేర్కొన్నాడు.

AlluArjun And Sneha Reddy Movie : భార్య స్నేహ తో అల్లుఅర్జున్ సినిమా !! - Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

తనే వ్యక్తిగత శ్రద్ధతో ఇలా చేయించిందని, ఇవి దీపావళి వైబ్స్ అని బ‌న్నీ చెప్పుకొచ్చారు. ఇక ఆయ‌న షేర్ చేసిన వీడియోలో బ‌న్నీ-స్నేహాలు విద్యుత్ కాంతుల న‌డుమ మెరిసిపోతూ అందంగా క‌నిపించారు. ప్ర‌స్తుతం ఆక‌ట్టుకుంటున్న ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారిపోయింది.

https://twitter.com/BunnyYouthIcon/status/1457364900271964170?s=20